రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినపించింది. తిరుపతి షిరిడి మధ్య తాత్కాలికంగా నడుస్తున్న రైలును రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. తిరుపతి షిరిడి రైలు ప్రతిరోజూ నడపాలంటూ సీఎం చంద్రబాబు ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. తిరుపతి షిరిడి రైలు సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు తెలిపింది.