ఏపీలోని రైలు ప్రయాణికులు శుభవార్త. రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ అధునాతక బోగీలను తీసుకువచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్‌కు ఈ బోగీలను (LHB) భారీగా కేటాయించారు. దీంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే పలు ప్రధాన రైళ్లకు, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకుప వీటిని అమర్చుతున్నారు. ఈ బోగీలలో సీటింగ్ బాగుంటుందని.. కుదుపుల్లేకుండా ప్రయాణించే వీలుంటుందని అధికారులు చెప్తున్నారు.