ఇప్పటివరకు అంబులెన్స్‌లోనో, ఆర్టీసీ బస్సులో, బస్టాండులో నిండు గర్భిణీలు ప్రసవించిన ఘటనలు వెలుగులోకి రాగా.. ఈరోజు ఓ గర్భిణి రైలులో ప్రసవించింది. యశ్వంత్ పుర నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన నిండు చూలాలికి భువనగిరి రైల్వేస్టేషన్‌కు రాగానే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అంబులెన్స్ సిబ్బంది వచ్చేలోపే రైలులోనే ఆ మహిళ.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.