ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కౌంటర్ వద్ద ఉంచిన ప్రత్యేక డివైజ్‌లో వచ్చే క్యూఆర్ కోడ్ సాయంతో పేమెంట్ చేసి, టికెట్ పొందవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రయాణికులకు చిల్లర సమస్యలు తీరనున్నాయి.