తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు స్టేషన్లలో ఈ పనులు సగం వరకు పూర్తయ్యాయి. ఇక మిగిలిన సంగం పనులు కూడా ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. అయితే ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఉంది. రూ. 25.41 కోట్ల వ్యయంతో.. ఈ స్టేషన్‌లో ఎన్నో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారు.