సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు శుభవార్త. తిరుపతికి వెళ్లే భక్తులు పెరుగుతుండగా.. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ రైలులో బోగీలను 16 నుంచి 20కి పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 2023 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ రైలు, అప్పటి నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పుడు అదనపు బోగీలతో మరింత మంది యాత్రికులు సులభంగా ప్రయాణించే అవకాశం లభించనుంది.