Robbery On Padmavati Express In Nellore District: తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు హల్ చల్ చేశారు. నెల్లూరు జిల్లాలో రైలు నెమ్మదిగా కదులుతుండగా బోగీల్లోకి చొరబడి మహిళల మెడలోని బంగారు గొలుసులు, నగదు దోచుకున్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ నుంచి వచ్చిన భక్తులు నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఒకటి, రెండు ఇలాంటి ఘటనలు జరిగాయి.