Korameenu Fish: మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని చాలా ఇండ్లలో ఈరోజు చేపల కూర గుమగుమలే వస్తుంటాయి. అది కూడా కొర్రమీను కావటంతో.. చేపల కూర, పులుసు, ఫ్రై ఇలా ఒక్కొక్కరూ ఒక్కో వెరైటీ చేసి.. లొట్టలేసుకుంటూ లాగిస్తుంటారు. అలా ఎందుకు.. ఈరోజు ప్రత్యేకత ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారా.. అలాంటిదేమీ లేదు. కానీ.. వాళ్ల ఊరికి దగ్గర్లో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో.. చేపల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో.. జనాలు ఎగబడి మరీ.. చేపలు దోచుకెళ్లారు.