"హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025" పేరిట అపోలో హాస్పిటల్స్ ఐదో ఎడిషన్ రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదికలో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి. "లక్షణాల కోసం ఎదురుచూడకండి - నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా చేసుకోండి" అనే మెసేజ్‌తో ఈ నివేదికను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షించి దీన్ని రూపొందించారు.