సాప్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఓ లేడీ డాన్ గంజాయి బిజినెస్ చేస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఈ వ్యాపారం చేస్తుండగా.. రూ. కోట్లలో ఆస్తులు కూడబెట్టింది. ప్రతి రోజూ రూ.4 లక్షల వరకు దందా సాగిస్తుందని పోలీసులు చెప్పారు. ఓ కేసులో ఆమె పేరు బయటకు రాగా.. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.