ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. లేని సౌకర్యాలు ఉన్నట్లు తప్పుడు నివేదికలు సమర్పించి లేఅవుట్లకు ఆమోదం పొందుతున్నారు. దీనివల్ల ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు మోసపోతున్నారు. ప్రభుత్వం ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బల్దియాలో విలీనమైన మావల, బట్టిసావర్గాం పరిధిలోకి అనేక లేఅవుట్లలో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.