ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన దృష్టికి వచ్చే సమస్యలను అంతే వేగంగా పరిష్కరిస్తుంటారు కూడా. ఈ నేపథ్యంలో పలువురు తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ దృష్టికి తీసుకువస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోకేష్ కూడా దీనిపై స్పందించారు. సంబంధిత అధికారులను సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.