వైఎస్సార్సీపీ లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. కానీ రాజ్యసభలో ఇంకో విధంగా వ్యవహరించి బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వానికి సహకరించిందనే ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయకుండా స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే తాము రాజ్యసభలో విప్ జారీ చేశామని.. తమకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.