హైడ్రా కూల్చేవేతలు పలువురు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు గుండెకోతను మిగుల్చుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టుకొని నిర్మించిన కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం అవుతుండటంతో వారి బాధ వర్ణాణాతీతంగా మారుతోంది. అన్ని పర్మిషన్లు తీసుకున్నా.. కొందరు బిల్డర్లు, బడాబాబులు చేసిన మోసానికి తాము బలై పోయామంటూ వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్దలను వదిలేసి తమలాంటి పేదల ఇండ్లను కూల్చేస్తోందని మండిపడుతున్నారు.