వంగలపూడి అనిత కూతురి డ్యాన్స్ చూశారా..? అదరగొట్టిన రేష్మిత శ్రీ

21 hours ago 2
విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో వంగలపూడి అనిత కూతురు రేష్మిత శ్రీ నృత్య ప్రదర్శన జరిగింది. కూతురి కూచిపూడి డాన్స్ చూసి హోంమంత్రి వంగలపూడి అనిత మురిసిపోయారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. 'ఈ క్షణం తల్లిగా నా మనస్సు ఉప్పొంగింది. నా కుమార్తె రేష్మిత కూచిపూడి నృత్యాభినయాన్ని వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్ష్యంగా చూడడం నయనానందాన్ని కలిగించింది. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో కూచిపూడి డ్యాన్స్ & మ్యూజిక్ అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో రేష్మిత కూచిపూడి నృత్య ప్రదర్శనకు పెద్దల ప్రశంసలు రావడం మధురానుభూతిని మిగిల్చింది. వార్షికోత్సవ వేడుకల్లో భాగస్వామ్యమై చిన్నారుల ప్రదర్శనను తిలకించడం మనసుకెంతో సంతృప్తినిచ్చింది.' అని రాసుకొచ్చారు.
Read Entire Article