ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పశువులు ఢీ కొంటున్నాయి. దీని వల్ల పశువుల ప్రాణాలు పోతున్నాయి. అంతే కాకుండా.. ఆ రూట్లో షెడ్యూల్ ప్రకారం నడిచే ట్రైన్ల సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ ట్రైన్లను ఆపేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. అర్జెంట్ పనిమీద వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా.. రైల్వే అధికారులు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.