వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో TDP పోటీపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

1 year ago 31
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలుగుజాతి సమగ్ర వికాసమే తమ పార్టీ లక్ష్యమన్నారు. అండమాన్‌లో సాధించిన విజయాలను ఉదహరిస్తూ.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన సమస్యలను అధిగమించి, తిరిగి బలపడతామని ధీమా వ్యక్తపరిచారు. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఓట్ల చీలిక, కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2041 నాటికి తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆశయమని ఆయన పేర్కొన్నారు.
Read Entire Article