ఇరుగు పొరుగు వారి నిందలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మహిళ, మరో యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కూడా ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.