ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే.. పరకాల నియోజకవర్గ రివ్యూ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి.. కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని.. రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు క్యూకట్టనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక.. కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రిని నెల రోజుల్లోపే ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు.