వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కఠిన చర్యలు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈరోజు (ఏప్రిల్ 6) నుంచి మే 5 వరకు 'సిటీ పోలీస్ యాక్ట్' సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ నెల రోజుల పాటు బహిరంగ సమావేశాలు, ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఇదే సమయంలో.. శబ్ద కాలుష్య నియంత్రణ, మైకులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాడాలని సూచించారు.