ఏపీకి వరద సాయం కింద విరాళాలు వెల్లువెత్తున్నాయి. వీఐపీల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన రీతిలో సాయం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రోజు కూలీ చేసిన వరద సాయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 600 రూపాయలు విరాళం ఇచ్చిన సుబ్రమణ్యం అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని ట్వీట్ చేశారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అతణ్ని అభినందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.