విజయవాడ వరద సహయక చర్యలపై ప్రభుత్వ తీరును విమర్శిస్తూ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘమైన పోస్టు పెట్టారు. విజయవాడలో వరదలు వచ్చి రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేదని ఆయన ఆరోపించారు. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని.. అసలు ప్రభుత్వం ఉందా అని అని ఆయన నిలదీశారు వరదల కన్నా ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందని ఆయన దుయ్యబట్టారు. 5 కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఐదారు లక్షల మందిని ఆదుకోలేదా? అని ధ్వజమెత్తారు.