మున్నేరు వరద ఉద్ధృతికి ఖమ్మం ప్రకాశ్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మందిని ఓ జేసీబీ డ్రైవర్ రక్షించిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా వరదలకు ఎదురెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అయితే రిస్క్ తీసుకున్న జేసీబీ డ్రైవర్‌ను వదలేసి.. బీఆర్ఎస్ నేతలు పొరపాటున వేరే వ్యక్తికి సన్మానం చేశారు.