తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, మిగులు బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. సన్న రకాలకు బోనస్ అందిస్తామని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.