గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కేసు కష్టాలు ఇప్పట్లో తొలిగేటట్టు లేవు. ఆయనకు కోర్టు వరుసగా రిమాండ్ విధిస్తోంది. తాజాగా వంశీపై.. బెదిరించి భూమిని విక్రయించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వల్లభనేని వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. గన్నవరం కోర్టు ఆవరణలో వంశీని ఆయన భార్య పంకజశ్రీతోపాటు లాయర్లు కలిశారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ కారు దిగగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. వంశీ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కనిపించారు. వంశీ కొత్త లుక్‌లో ఉన్నారని చర్చించుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.