Devotee Donated Rs 72 Lakhs Gold Haram To Vadapalli Temple: కోనసీమలోని వాడపల్లి వెంకన్నకు విశాఖపట్నానికి చెందిన భక్తులు ఖరీదైన కానుకను అందజేశారు. రూ.71.94 లక్షల విలువైన బంగారు హారం ఇచ్చారు. విశాఖపట్నానికి చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు సుమారు 463.920 గ్రాముల బంగారు హారాన్ని అందజేశారు. ప్రత్యేక పూజల తర్వాత ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు.