ఏపీలో చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. 'వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు..' అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లే మనస్తాపానికి గురై ఎస్సై మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయగా.. అందుకు ప్రస్తుత ఆడియా బలం చేకూర్చుతోంది. తప్పుడు కేసులో ఇరికించి 4 నెలలుగా వీఆర్‌లో పెట్టి అవమానించటంతోనే సూసైడ్ చేసుకున్నట్లు ఆడియో కాల్ ద్వారా తెలిసింది.