పాలిటిక్స్, ప్రజా సేవలో బిజీగా ఉంటూ ప్రత్యర్థులపై పదునైన పంచులతో విమర్శలు గుప్పించే కేంద్రమంత్రి బండి సంజయ్ తనలో దాగి ఉన్న కళను బయటపెట్టారు. ఘాటుగా విమర్శలు చేయటమే కాదు.. శ్రావ్యంగా పాట కూడా పాడగలనని నిరూపించారు. ప్రధాని మోదీపై సంజయ్ ఓ పాట పడగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆ పాటను షేర్ చేస్తూ సంజయ్‌ను కొనియాడుతున్నారు.