తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద ప్రసంగించిన రేవంత్ రెడ్డి చాలా విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ, సోషల్ మీడియా పోస్టులు, ట్రాఫిక్ నియంత్రణపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలోనే సంచల ప్రకటన చేశారు. డ్రగ్స్ కేసులో దొరికిన వారికి కరెంట్, నీళ్లు కట్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు.. సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్కక్తం చేశారు.