Sridhar Babu on Musi Demolitions: మూసీని సుందరీకరించి.. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ ఫ్రంట్ బోర్డును ఏర్పాటు చేసుకుని ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని.. స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పుకొచ్చారు.