తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాలపై సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం వద్దని.. మన రాష్ట్రంలో కూడా వైటీడీ ఆలయం ఉందని చెప్పారు. భద్రాచలంలో రాములవారు.. యాదగిరి, రామప్పలో ఆలయాలు ఉన్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.