చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద జరిగిన దాడిపై పలువురు రాజకీయ, ఆధ్యాత్మిక వేత్తలు స్పందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, బండి సంజయ్, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు స్పందించగా.. త్రిదండి చినజీయర్ స్వామి కూడా స్పందించారు. రామరాజ్య స్థాపన ఏ ఒక్కరితోనో సాధ్యం కాదని.. హింస ద్వారా అసాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజలంతా అనుకుంటే రామరాజ్య స్థాపన పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు.