ఐదు లేదా ఆరు సార్లు నిబంధనలను అతిక్రమించే వాహనదారుల లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రద్దయిన లైసెన్స్‌లు మళ్లీ పునరుద్ధరించబోవని చెప్పారు. అలాంటి వారి వాహనాల రిజిస్ట్రేషన్ కూడా ఉండదని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని.. ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియపై కమిటీ ఉంటుందని వెల్లడించారు.