ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పాత వాహనాలకు చెల్లించే గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. మరోపైపు ఇప్పటికే ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలోని వాహనదారులకు గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రూ.20 వేల వరకూ ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను రూ.3000 వేల వరకూ తగ్గించారు.