వికారాబాద్ జిల్లా బండమీదిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దేవుడిలా శిశువును కాపాడాడు. అప్పుడే పుట్టిన బిడ్డలో కదలికలు లేకపోవడంతో 108 అంబులెన్స్ సిబ్బంది నర్సిములు సమయస్ఫూర్తితో సీపీఆర్ చేశాడు. శిశువు చనిపోయిందని అంతా భావించగా.. అతడు మాత్రం సీపీఆర్‌తో శిశువును బతికించాడు. దీంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.