తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్‌లో మారోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో మంగళవారం ఫుడ్ పాయిజన్ కారణంగా 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే వరుస ఘటనలు జరగుతున్నా.. హాస్టళ్లలో సిబ్బంది తీరు మారటం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.