విజయమ్మతో వైఎస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శ

1 month ago 3
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. అనారోగ్య సమస్యలు, వయోభారంతో వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ సోమవారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బాపట్ల జిల్లా మేదరమెట్లకు చేరుకున్న వైఎస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ విజయమ్మతో కలిసి పిచ్చమ్మ పార్థీవదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం సుబ్బారెడ్డి విజయమ్మ, వైఎస్ జగన్ ఓదార్చారు. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో వైఎస్ జగన్‌కు విబేధాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Read Entire Article