విజయవాడ కలెక్టరేట్‌లో ఉద్యోగులపై కారం చల్లిన వృద్ధురాలు.. కారణమిదే..

4 months ago 22
విజయవాడ కలెక్టరేట్‌లో ఉద్యోగులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అధికారులపై సదరు మహిళ కారం చల్లటంతో అక్కడి వారందరూ షాక్ తిన్నారు. నందిగామ మండలంలోని అనాసాగరానికి చెందిన లక్ష్మీతులసి అనే వృద్ధురాలు తనకు రావాల్సిన పరిహారం కోసం విజయవాడ కలెక్టరేట్‌కు వెళ్లారు. అయితే అధికారులు తనను పట్టించుకోలేదనే కోపంతో భూసేకరణ విభాగంలోని ఉద్యోగులపై కారం చల్లారు. దీంతో ఉద్యోగులతో పాటుగా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.
Read Entire Article