Vijayawada To Varanasi Direct Flights From August 13: ఏపీ ప్రజలకు శుభవార్త.. వారణాసికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభంకానుంది. ఆగస్టు 13 నుంచి విజయవాడ – వారణాసి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 13 నుంచి ఈ సర్వీసులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ విమాన సర్వీసుల్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ నడపనుంది. ఇప్పటికే టిక్కెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.