Vijayawada Durga Temple Huge Income: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కించారు. ఆలయంలోని మల్లికార్జున మండపం ఆరో అంతస్తులో లెక్కించగా.. నగదు రూపంలో రూ.2,28,81,128 ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 328 గ్రాములు, వెండి 3 కిలోల 480 గ్రాములు, విదేశీ కరెన్సీ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా కూడా ఆదాయం వచ్చింది. ఆలయంలో హుండీల లెక్కింపును ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో రత్నరాజు పర్యవేక్షించారు.