హీరో అక్కినేని నాగచైతన్య బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నాగచైతన్యతో పాటుగా తండేల్ చిత్ర యూనిట్ దుర్గమ్మను దర్శించుకుంది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదాశ్వీరచనం అందించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తండేల్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో తండేల్ విజయయాత్రలో భాగంగా విజయవాడలో తండేల్ చిత్ర బృందం పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే గాంధీనగర్‌లోని శైలజ థియేటర్లో సినీ హీరో అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి , నిర్మాత బన్ని వాసు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు.