ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వరదలతో విజయవాడ నగరం తీవ్రంగా నష్టపోయింది. ఎంతో మంది ప్రజల జీవితాలు రోడ్డు మీదికొచ్చాయి. కాగా.. కొన్ని ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉండటంతో.. చాలా మంది సాధారణ జీవితంలోకి రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే.. వారికి అండగా నిలిచేందుకు ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. విజయవాడ వరద బాధితులకు విక్రం నారయణ రావు కుటుంబం అండగా నిలిచింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు కోటీ 55 లక్షల 55 వేల 555 రూపాయల చెక్కును అందించింది.