Macherla Vijayawada 67228 Train Schedule Changed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రతి రోజూ మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలు ఇకపై ఉదయం 5.30 గంటలకు బదులు 6 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, చెంగల్పట్టు-కాకినాడ, పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్‌లో కూడా మార్పులు చేశారు. తమిళనాడు వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.