Vijayawada Rtc Bus Fake Conductor: విజయవాడ పండిడ్ నెహ్రూ బస్టాండ్‌లో.. ఊరు వెళదామని ఆర్టీసీ బస్సెక్కిన ప్రయాణికులకు ఓ వ్యక్తి ఊహించని షాకిచ్చాడు. మనోడి దెబ్బకు ప్రయాణికులు అవాక్కయ్యారు.. మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు. ఓ వ్యక్తి కండక్టర్‌లా నటించి ప్రయాణికుల నుంచి డబ్బుల్ని వసూలు చేశాడు. కట్ చేస్తే ఆ వెంటనే బస్సు దిగి పారిపోయాడు. అప్పుడు బస్సులో ప్రయాణికులకు తాము మోసపోయినట్లు గుర్తించారు.. వారిలో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.