Vijayawada Traffic Restrictions Today: ఇవాళ విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటూ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. పెద్దఎత్తున నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు కూడా హాజరవుతున్నారు. దీంతో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. విజయవాడలోకి భారీ వాహనాలు రాకుండా నగరం వెలుపల నుంచే వాటి రాకపోకలను నియంత్రిస్తున్నారు.