Ys Jagan Seeks Court Permission To Travel Uk: విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సెప్టెంబరులో యూకే వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. మరోవైపు విజయసాయిరెడ్డి పిటిషన్‌పై వాదానలు పూర్తి కాగా.. తీర్పు ఈ నెల 30కి వాయిదా పడింది. సెప్టెంబరు, అక్టోబరులో యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి కూడా అనుమతి కోరారు.