విద్య, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ వస్తాయి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..

11 months ago 22
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయాల కోసమే కాదని.. విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరి హక్కులనూ లాక్కోవడం లేదని.. ఈ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తాము సహకరించామని గుర్తు చేస్తూ.. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే బీసీ వర్గాలు మౌనంగా ఉండవద్దని ఆయన పిలుపునిచ్చారు.
Read Entire Article