పేద, బడుగు వర్గాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీడీ కార్మికుల పిల్లల కోసం స్కాలర్‌షిప్ పథకాన్ని అందిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థులు అందరూ ఈ ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 31 వరకు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.