తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6న హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ప్రకటించింది. దీనికితోడు, సెప్టెంబర్ 5న మిలాద్-ఉన్-నబీ, సెప్టెంబర్ 7న ఆదివారం సెలవు ఉండటంతో ఈ జిల్లాల వారికి వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి.