తెలంగాణలో విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త వినిపించాయి విద్యాసంస్థలు. రెండో శనివారం, ఆదివారం పేరుతో ఇప్పటికే రెండు రోజులు సెలవులు రాగా.. సోమవారం (ఏప్రిల్ 14న) రోజున కూడా విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనితో పాటు.. మరో మూడు రోజుల తర్వాత ఇంకో సెలవు కూడా రానుంది.